In a cruel incident, a 10-year-old boy was beaten by an iron rod till lost life by his mother's paramour in the city.
దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల మాయలో కుటుంబ సభ్యులను, కట్టుకున్నవాళ్లను కడతేర్చడానికి కూడా వెనుకాడట్లేదు. తాజాగా చెన్నైలోనూ ఓ వివాహేతర సంబంధం ఇలాంటి హత్యకే దారితీసింది.
చెన్నైలోని తాంబరం సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంటులో బుధవారం ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో గురువారం పోలీసులు బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడి తల్లిదండ్రుల అనుమానం మేరకు నాగరాజు(27) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా అసలు నిజాలు వెలుగుచూశాయి.
హత్యకు గురైన బాలుడి పేరు రితేష్ సాయి అని పోలీసులు తెలిపారు. రితేష్ నేసపాక్కంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నట్టు చెప్పారు. హంతకుడు నాగరాజుకు బాలుడి తల్లి మంజులతో వివాహేతర సంబంధం ఉందని తెలిపారు. మంజుల ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగస్తురాలని వెల్లడించారు
మంజుల భర్త కార్తీకేయన్ ఇంటీరియర్ డిజైన్ సంస్థను నడుపుతున్నారని పోలీసులు వెల్లడించారు. రోజూ లాగే కుమారున్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు బుధవారం సాయంత్రం కార్తీకేయన్ అక్కడికి వెళ్లారని, కానీ అప్పటికే మరో వ్యక్తి బాలుడిని తీసుకెళ్లినట్టుగా ఆయనకు తెలిసిందని అన్నారు.దీంతో ఎంజీఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కార్తీకేయన్ బాలుడి మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారని చెప్పారు.
విచారణ చేపట్టిన పోలీసులకు.. కార్తీకేయన్‌కు నాగరాజు అనే వ్యక్తితో గతంలో గొడవ జరిగినట్టు గుర్తించారు. తన భార్య మంజులతో నాగరాజుకు సంబంధం ఉందని అనుమానించిన కార్తీకేయన్.. కొన్ని నెలల క్రితం అతనితో గొడవపడ్డట్టు గుర్తించారు. అంతేకాదు, తన భార్యతో సంబంధాన్ని అడ్డుపెట్టుకుని నాగరాజు తన ఆస్తిని కాజేసే కుట్ర చేసినట్టు కార్తీకేయన్ పసిగట్టినట్టు తెలిపారు.